massive fire
-
ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు
జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని జెరూసలేం సమీపంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 మంది గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు అగి్నమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్చిచ్చు ఆందోళనతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసిన ఇజ్రాయెల్.. మంటలు ఆర్పేందుకు అంతర్జాతీయ సాయం కోరుతోంది. జెరూసలేం నగర శివార్లలో చెలరేగుతున్న భారీ మంటల కారణంగా అధికారులు కేవలం 24 గంటల్లో వేలాది మంది నివాసితులను ఖాళీ చేయించారు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవ ఇప్పటివరకు 23 మందికి చికిత్స అందించింది. వారిలో 13 మంది కాలిన గాయాలు, పొగ పీల్చడంతో ఆసుపత్రి పాలయ్యారు. జెరూసలేం నుంచి టెల్ అవీవ్ వెళ్లే ప్రధాన మార్గంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొండటలపై దట్టమైన పొగలు వ్యాపించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంటల ధాటికి చాలా మంది తమ కార్లను వదిలేసి పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. వందలాది మంది పౌరులు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారని ఏజెన్సీ హెచ్చరించింది. కార్చిచ్చు కొనసాగుతున్న రూట్ 1 సహా పలు రహదారులను మూసివేశారు. 160 రెస్క్యూ, అగి్నమాపక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అలాగే డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ దేశ సైన్యం కూడా గాలింపు, సహాయక చర్యలకు సహకరిస్తోంది. అయితే పొడి వాతావరణం, అధిక గాలుల కారణంగా మంటలు మరింత తీవ్రమవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ కార్చిచ్చు ఈ దశాబ్దంలోనే అతి పెద్దదని ఇజ్రాయెల్ అగి్నమాపక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లోని జాతీయ ఉద్యానవనాలు, అడవుల వైపు ప్రజలు వెళ్లకుండా నిషేధించారు. ‘‘జెరూసలేం హిల్స్‌లో జరిగిన అగి్నప్రమాదం ఈ దేశంలోనే అతిపెద్దది కావచ్చు.మా యాక్టివిటీకి సంబంధించి. ఇది చాలా కాలం కొనసాగుతుంది. మేము నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నాం.’’అని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ జెరూసలేం జిల్లా కమాండర్ ష్ములిక్ ఫ్రీడ్మన్ చెప్పారు. గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దళం 18,000 లీటర్ల అగి్నమాపక సామగ్రిని క్యారీ చేయగల సి –130 జె సూపర్ హెర్క్యులస్ భారీ రవాణా విమానాలను ఈ ఆపరేషన్లలో మోహరించింది. ఈ తరహా విమానాలు రెండు మంటలను ఆర్పే ందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 3వేల ఎకరాల అడవి కాలిపోయింది. 2010 ఉత్తర ఇజ్రాయెల్‌లోని మౌంట్ కార్మెల్లో కార్చిచ్చు.. 12వేల ఎకరాలను దహనంచేసింది. 44 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రస్తుత కార్చిచ్చు ఆ విపత్తు స్థాయి, ప్రభా వంలో అంతకు మించి ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు...కార్చిచ్చు చెలరేగడంతో ఇజ్రాయెల్‌లో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. జెరూసలేంలో జరగాల్సిన ప్రధాన ప్రభుత్వ కార్యక్రమం సహా అన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం రద్దయ్యాయి. అనంతరం ఈ వేడుకను రికార్డు చేసి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రదర్శించారు. కార్చిచ్చు జెరూసలేంను చేరే అవకాశం ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. పశి్చమంగా వీస్తున్న గాలి మంటలను జెరూసలేం శివార్ల వైపు, నగరంలోకి కూడా సులభంగా నెట్టేయగలదని, జెరూసలేంను రక్షించడమే ప్రస్తుత ప్రాధాన్యతని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్చిచ్చును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ సహాయం కోరింది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ స్పందించింది. మంటలను ఆర్పేందుకు విమానాన్ని పంపనున్నట్టు ప్రకటించింది. స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా, క్రొయేíÙయా, ఇటలీ, ఉత్తర మాసిడోనియా కూడా విమానాలాను పంపుతామని తెలిపాయి. తోడైన ఇసుక తుఫాను... కార్చిచ్చుకు భారీ ఇసుక తుఫాను తోడయ్యింది. ఆకాశమంతా ఇసుక మేఘాలు నిండిపోవడంతో అసలేమీ కనిపించడం లేదు. నెగెవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి ఇసుక తుఫాను చేరింది. గాలుల తీవ్రత కారణంగా సైనిక స్థావరం గేట్లను మూసివేయడానికి సైనికులు కష్టపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. పగటి పూట భారీ గాలులు వీస్తాయని, భారీ పొగమంచు ఏర్పడుతుందని, దక్షిణాదిన ఇసుక తుఫానులు కూడా వస్తాయని చెప్పారు. తీరం వెంబడి 98 నుంచి 100 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం
-
యాదాద్రిలో భారీ అగ్నిప్రమాదం
-
Nampally: పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
-
నాయబ్ హోటల్లో ప్రమాదం
-
ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బొప్పాయి ట్రీ హోటల్లో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఆరు అంతస్తుల హోటల్ ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు యత్నించినా నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఆరో అంతస్తులో వ్యక్తులు చిక్కుకుపోవడంతో వారిని నిచ్చెన, బెడ్షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని రక్షించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పొగ భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముమ్మరంగా సహాయం చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel's kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR — Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023 (చదవండి: కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్) -
డియోడ్రెంట్ ఎఫెక్ట్.. బెడ్రూంలో భారీ పేలుడు
లండన్: సాధారణంగా గ్యాస్ లీక్ అవ్వడం, రసాయనాలు, మందుగుండు పదార్థాల వల్ల పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయని మనకు తెలుసు. కానీ మనం వాడే డియోడ్రెంట్ వల్ల కూడా పేలుడు సంభవిస్తుందని మీకు తెలుసా. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. చెమట వాసనకు అడ్డుకట్టవేయడం కోసం మనం వాడే డియోడ్రెంట్ వల్ల భారీ పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వివారలు.. లండన్‌కు చెందిన అట్రిన్ బెమజాది(13) అనే కుర్రాడు లండన్‌లో తన తల్లితో కలసి నివసిస్తుండేవాడు. ఆమె డెంటిస్ట్‌గా పని చేసేది. ఈ క్రమంలో ఓ రోజు అట్రిన్ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వసాగాడు. దానిలో భాగంగా డియోడ్రెంట్ స్ప్రే చేసుకున్నాడు. (చదవండి: ‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’) అయితే పొరపాటున ఆ స్ప్రే పక్కనే ఉన్న క్యాండిల్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి దృశ్యాలు చూసిన వారికి ఇక్కడేమైనా బాంబు పేలిందా.. ఏంటీ అనిపిస్తుంది. ప్రమాద ధాటికి బెడ్రూం కిటికీలు, తలుపు బద్దలయ్యాయి. (చదవండి: వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!) ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కరూమ్లో ఉన్న అట్రిన్ సోదరి ప్రమాదాన్ని గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రస్తుతం అట్రిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. fire in battersea pic.twitter.com/9Qo8cPQAZf — a Deb (@AkashDe69028264) October 12, 2021 -
ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు
-
పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
-
పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టించింది. 850 సంవత్సరాల అతిపురాతనమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు గాయపడ్డారనీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. 12వ శతాబ్దానికి చెందిన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చర్చి భవనంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను అక్కడనుంచి దూరంగా తరలించారు. కానీ 93 మీటర్ల (305 అడుగుల) శిఖరం కూలిపోయింది. అయితే అనేక అమూల్య కళాఖండాలు, చారిత్రక చిహ్నాలను భద్రపరిచారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్‌తో పాటు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదితర ప్రపంచ నేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు, లేడీ ఆఫ్ ప్యారిస్ మంటల్లో చిక్కుకుందంటూ ఇమ్యాన్యూల్ ఒక భావోద్వేగ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. పూర్తిగా కలపతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం యూరప్‌లో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. 1991లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. పురాతన చర్చిని పునరుద్దరించేందుకు ఫ్రాన్స్ చేపట్టే చర్యలకు సహాయం అందిస్తామని యునెస్కో వెల్లడించింది. The moment #NotreDame’s spire fell pic.twitter.com/XUcr6Iob0b — Patrick Galey (@patrickgaley) April 15, 2019 -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ భారీ అగ్నిప్రమాదం
-
ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం
-
క్షణాల్లో బూడిదైంది
= గుజిరీలో భారీ అగ్నిప్రమాదం = రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం అనంతపురం సెంట్రల్ : నగరంలోని నేషనల్పార్కు సమీపంలోని సుఖదేవ్‌నగర్‌లో ఉన్న గుజిరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న ఖాదర్‌బాషా, ఆయన కుమారుడు నూర్‌బాబా గుజిరీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. నేషనల్ పార్కు సమీపంలో జాతీయరహదారి పక్కన గుజిరీ నిర్వహిస్తున్నారు. వాడి పడేసిన వాటర్ బాటిâýæ్లను ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు గుజిరీకి నిప్పంటుకుంది. నిర్వాహకులు గమనించి వెంటనే ఫైరింజి¯ŒSకు సమాచారమందించారు. ప్లాస్టిక్ బాటిల్స్ కావడం, ఆరుబయట గుజిరీ ఉండడంతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేలోపు గాలి వ్యాపించి నిమిషాల్లో మంటలు గుజిరీ అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అగ్రిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి వీలులేకుండా పోయింది. మంటల్లో దాదాపు 80 శాతం గుజిరీ కాలిపోయింది. రెండు ఫైరింజిన్లు వచ్చి మంటలు అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గుజిరీ మొత్తం కాలిబూడిద కావడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుడు నూర్‌బాబా మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. షార్టుసర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్నది తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్టేష¯ŒS ఫైర్ ఆఫీసర్ కేపీ లింగమయ్య నష్టం అంచనా వేశారు. దాదాపు రూ.10 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించారు. -
ముంబై లింకింగ్ రోడ్లో అగ్నిప్రమాదం
-
పుట్టింగల్ దేవి ఆలయ విశిష్టత
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనా భరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌లో మీనమ్ మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గుడిలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తుంటారు. అంతేకాదు మగవారు ఆడవారిలాగా అలంకరించుకొని దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత బాణాసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కూడా లక్షలాదిమంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చారు. పూజలు చేసిన తర్వాత బాణాసంచాను కాల్చడం మొదలు పెట్టారు. అయితే ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పు రవ్వలు ఎగిసి పక్కనే ఉన్న... బాణాసంచాపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అలాగే దీపాల కోసం ఉంచిన నూనె కూడా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించి ఉండటం... ప్రమాదం జరిగిన సమయంలోనే ఎక్కువ మంది ఒకేచోట ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. నిమిషాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ప్రాణనష్టం భారీగా ఉందని తెలుస్తోంది. -
ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం: 83 మంది మృతి
కొల్లం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 80 మందికిపైగా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కొల్లం, తిరువనంతపురం ఆస్పత్రులకు తరలించారు. కేరళ సీఎం ఉమెన్ చాందీ, మంత్రులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ భారీగా మంటలు
-
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: ముంబై లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మలాద్ ఏరియాలోని ఒక స్క్రాప్ దుకాణంలో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల చాలా షాపులకు మంటలు విస్తరించాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికి గాయలైన కేసులు కానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. -
పుణేలో భారీ అగ్నిప్రమాదం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే క్యాంప్‌లోని ఫ్యాషన్స్ట్రీట్లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 దుకాణాలు మంటల్లో చిక్కుకొని బూడిదయ్యాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుమారు 500 దుకాణాల సముదాయంతో ఉన్న ఈ ఫ్యాషన్ స్ట్రీట్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో నష్టం భారీగానే జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపకశాఖ అధికారులు ఆరు వాహనాలతో వెంట నే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినా 15 దుకాణాల వరకు మంటల్లో కాలి బూడిదయ్యాయి. నంబరు 107 నుంచి 121 వరకు ఉన్న రెడీమేడ్ దుస్తులు, లెదర్ బ్యాగులు, బూట్లు, అల్పాహార దుకాణాలు ఈ దుర్ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంలో జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. -
రాజదాని ఎక్స్‌ప్రెస్‌లో అనూహ్యరీతిలో మంటలు