breaking news
of vehicles
-
హైస్పీడ్‌లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో వాహన విక్రయాల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది. గత నెల మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు 26 శాతం పెరిగి 24,09,362 యూనిట్లకు చేరినట్లు డీలర్ల సమాఖ్య ఫాడా ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 19,17,934 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగినట్లు వివరించింది. ఆరింట అయి దు కేటగిరీల్లో (టూవీలర్లు, త్రీ–వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ట్రాక్ట ర్లు) ఫిబ్రవరిలో అత్యధికంగా రిటైల్ సేల్స్ నమోదైనట్లు ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. మార్కెట్లో పటిష్టమైన డిమాండ్‌ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణతో రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్, కొత్త మోడల్స్ రాకతో బుకింగ్స్ మెరుగ్గా ఉండటంలాంటివి పరిశ్రమకు సానుకూలంగా నిల్చినట్లు వివరించారు. పంట దిగుబడులు బాగుండి గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత మెరుగుపడటం, ఆకర్షణీయమైన మార్కెటింగ్ స్కీములు కలిసి వచి్చనట్లు డీలర్లు చెప్పారు. ఇతర విశేషాలు.. → టూవీలర్లు 25%, త్రిచక్ర వాహనాలు 24%, ప్యాసింజర్ వాహనాలు 26%, కమర్షియల్ వాహనాలు 29% అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. → ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,13,015 యూనిట్ల నుంచి 3,94,768 యూనిట్లకు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 21 శాతం, గ్రామీణ మార్కెట్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, యుటిలిటీ వాహనాలే ఓవరాల్‌గా ఈ విభాగానికి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, చిన్న కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నెలకొనడం సానుకూలాంశం. → టూవీలర్ విక్రయాలు 13,60,155 యూనిట్ల నుంచి 17,00,505 యూనిట్లకు పెరిగాయి. → వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 78,219 యూనిట్ల నుంచి 1,00,820 యూనిట్లకు పెరిగాయి. → త్రీ–వీలర్ సేల్స్ 1,17,130.. ట్రాక్టర్ల అమ్మకాలు 89,418 యూనిట్లుగా నమోదయ్యాయి. -
హైస్పీడ్‌కు ‘బ్రేక్’!
- వాహనాలకు స్పీడ్ గవర్నర్ - 3,500 కిలోల పైబడి బరువున్న వాటికి తప్పనిసరి - రోడ్డు రవాణా శాఖ తాజా నిర్ణయం అనంతపురం సెంట్రల్ : హైదరాబాద్‌లో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు 200 కిలోమీటర్ల వేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కొంతకాలం క్రితం జేఎన్‌టీయూసీ వైస్‌చాన్సలర్ సర్కారు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పామిడి వద్ద రాంగ్‌రూట్‌లోకి వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలూ అతివేగం వల్ల జరిగినవే. ఇటీవలి కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఎక్కువ ప్రమాదాలకు కారణం అతివేగమే. ఇకమీదట ఇలాంటి ఘటనలకు కళ్లెం వేయాలని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ(ఆర్టీఏ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వాహనాలకు ‘స్పీడ్ గవర్నర్’ పరికరాలను అమర్చనున్నారు. 3,500 కిలోల పైబడి బరువు కల్గి, ఎనిమిది మంది ప్రయాణికులు కూర్చునే వీలున్న ప్రతి వాహనానికి స్పీడ్ గవర్నర్ తప్పనిసరన్న నిబంధన విధించారు. స్కూల్ బస్సులు 60 కిలోమీటర్లు, ఇతర వాహనాలు 80 కి.మీలకు మించి వేగంతో వెళ్లకూడదు. అలా వెళితే స్పీడ్‌గవర్నర్ నియంత్రిస్తుంది. అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు తదితర వాటికి ప్రజాప్రయోజనం దృష్ట్యా ఈ నిబంధనను మినహాయిస్తున్నారు. స్పీడ్ గవర్నర్ ఉంటేనే అనుమతులు స్పీడ్ గవర్నర్ అమర్చిన వాహనాలకే పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) తదితర అనుమతులు మంజూరు చే యాలని నిర్ణయించారు. ఈ నెల 15తో స్కూల్ బస్సులకు ఎఫ్‌సీ గడువు పూర్తవుతుంది. జిల్లాలో 800 స్కూల్ బస్సులు ఉండగా.. వాడుకలో 650 వరకు ఉన్నాయి. ఇతర వాహనాలు 75 వేలు ఉండగా.. వాడుకలో 60 వేల దాకా ఉన్నాయి. వీటిలో ఆటోలు 15 వేలు మినహాయిస్తే మిగిలిన వాటికి స్పీడ్ గవర్నర్ అమర్చుకోవాల్సి ఉంటుంది. నాణ్యతపై అనుమానాలు రోడ్డు రవాణాశాఖ స్పీడ్‌గవర్నర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పలు ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే పరికరాలను అందజేస్తామని ముందుకు వస్తున్నాయి. దాదాపు 25 సంస్థలు స్పీడ్ గవర్నర్ పరికరాల సరఫరాకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన ఓ సంస్థ రూ.5 వేలకే ఇస్తామని చెప్పగా, విజయవాడకు చెందిన సంస్థ రూ.7వేల చొప్పున ధర నిర్ణయించాయి. దీన్నిబట్టి చూస్తే నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. స్పీడ్ గవర్నర్ లేకపోతే జరిమానా : శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనానికి స్పీడ్ గవర్నర్ అమర్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. కావున తప్పనిసరిగా అమర్చుకోవాలి. లేదంటే రూ.2 వేల జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకుంటాం.


