కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్‌ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడం
వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.
సరైన ఐడీవీ ఎంచుకోకపోవడం
వాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.
ఎన్‌సీబీ ఉపయోగించుకోకపోవడం
పాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.
పాలసీలను పోల్చి చూడకపోవడం
ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.
యాంటీ థెఫ్ట్ డివైజ్‌లను అమర్చుకోకపోవడం
ఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్‌లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్‌లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్‌లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్‌లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్‌లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు.


