
సాక్షి, విజయవాడ: డీఏ విడుదలపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను జీవోలో చేర్చడం దారుణమన్న ఉపాధ్యాయ సంఘాలు.. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి.. జీవోలో ప్రస్తావించకపోవడం సరికాదన్నాయి.
‘‘ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిల చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నాం. 4 డీఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేసి దానిలో గందరగోళానికి గురిచేయమంటే మోసం చేయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 60,61లను సవరించి, సొమ్ము రూపంలో చెల్లించాలి’’ అని యూటీఫ్ డిమాండ్ చేసింది.
చంద్రబాబు సర్కార్.. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ తిన్నారు.