ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. రేపు సంతాపదినం ప్రకటించిన కేంద్రం

Published Mon, May 20 2024 7:25 PM

One Day Mourning In India For Iran President Death

న్యూఢిల్లీ: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం(మే19) జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. రైసీ మృతి పట్ల చాలా దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇందులో భాగంగా రైసీకి గౌరవ సూచకంగా భారత్‌ మంగళవారం (మే 21) సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్‌ తొలి సుప్రీంలీడర్‌ అయతొల్లా ఖొమేనీ కన్నుమూసినపుడు కూడా భారత్‌ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement