మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్‌ రావు | harish rao comments on congress over DA | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్‌ రావు

Oct 27 2024 4:28 PM | Updated on Oct 27 2024 4:41 PM

harish rao comments on congress over DA

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.   పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్‌ రావు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement