హైదరాబాద్ : అద్భుతమైన హావభావాలు..అలరించే నృత్యభంగిమలు..కళ్లు చెదిరే ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి. రవీంద్రభారతిలో అర్ధనారీశ్వరం పేరిట సోమవారం ప్రారంభమైన జాతీయస్థాయి ఉత్సవాల్లో ‘ద్వయం, సమర్పణం, అధర్వ’ నృత్యాలు అలరించాయి. ప్రకృతి ప్రత్యేకతను, స్త్రీ పురుష సమానత్వాన్ని చాటిచెప్పాయి.


