బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

Feb 12 2026 11:26 AM | Updated on Feb 12 2026 11:26 AM

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. బాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 161 డివిజన్లు / వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ముగిసింది.ఈనెల 13వ తేదీన (శుక్రవారం) కౌంటింగ్‌ అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద స్ట్రాంగ్‌ రూమ్‌లు

మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు బ్యాలెట్‌ బాక్సులను తరలించారు. నల్లగొండ కార్పొరేషన్‌కు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆర్జాలబావిలోని వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించి భద్రపరిచారు. దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్‌ఎల్‌బీసీలోని నిడమనూరు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించి అక్కడ భద్రపరిచారు. మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాన్ని అవంతిపురం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయడంతో ఈ మూడు మున్సిపాలిటీల బ్యాలెట్‌ బాక్సులను అక్కడకు తరలించి స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచారు.

పటిష్ట భద్రత..

జిల్లాలోని 3 కౌంటింగ్‌ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్‌ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్‌ రిజర్వుడ్‌ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్‌ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్‌ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

రేపు కౌంటింగ్‌

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఈ నెల 13వ తేదీన జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 473 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నెల 13వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిన బాక్సులు

మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement