యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

Feb 12 2026 11:26 AM | Updated on Feb 12 2026 11:26 AM

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

తిప్పర్తిలో రాస్తారోకో చేస్తున్న రైతులు

తిప్పర్తి : అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా అందించాలని కోరుతూ బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతు యాప్‌ ద్వారా యూరియా సరఫరా చేయడం ద్వారా సామాన్య రైతులకు అందడం లేదని, యాప్‌ గురించి తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో అప్‌డేట్‌ చేసిన క్షణాల్లో యూరియా అయిపోతుందని, పెద్ద రైతుల కోసమే యూరియా యూప్‌ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రామకృష్ణ రైతుల వద్దకు చేరుకుని అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement