బడుల్లో మోగని నీటిగంట | - | Sakshi
Sakshi News home page

బడుల్లో మోగని నీటిగంట

Feb 7 2026 2:47 PM | Updated on Feb 7 2026 2:47 PM

బడుల్లో మోగని నీటిగంట

బడుల్లో మోగని నీటిగంట

నల్లగొండ : పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ మూగబోయింది. విద్యార్థులు సమయానికి తప్పనిసరిగా నీరు తాగేందుకు వాటర్‌బెల్‌ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. విద్యాధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఎక్కడా వాటర్‌ బెల్‌ మోగడం లేదని విమర్శలు వస్తున్నాయి. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా వాటర్‌ బెల్‌ అమలయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

అనారోగ్య సమస్యలు

ఎదుర్కొనే అవకాశం

జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు తగినన్ని నీరు తీసుకోరు. నీరు ఎక్కువ తాగితే టీచర్లు మూత్రశాలలకు పంపరని మరికొందరు భావిస్తుంటారు. అంతేకాకుండా మూత్రశాలలు లేవని, దప్పిక వేయడం లేదని ఇంకొందరు నీరు తాగడం లేదు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీనిని అధిగమించేందుకు కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో కూడా వాటర్‌ బెల్‌ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు.

ఫ పాఠశాలల్లో అమలు కాని వాటర్‌బెల్‌

ఫ కొరవడిన విద్యాధికారుల పర్యవేక్షణ

వయస్సుల వారీగా

తీసుకోవాల్సిన నీరు ఇలా..

వయస్సు లీటర్లు

1, 2 1

2– 5 1.2

5– 8 1.5

9– 13 1.6 –2

14– 18 2.2 –2.6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement