రోగులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

దేవరకొండ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కల్టెకర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్‌ పేషంట్‌, అవుట్‌ పేషంట్‌, పార్మసీ, ప్రసూతి విభాగాలను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్‌ మధుసూదన్‌ ఉన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement