మున్సిపల్ బరిలో బత్తుల బలగం
ఫ నామినేషన్లు వేసిన ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కుమారులు
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి, ఇద్దరు కుమారులు బత్తుల సాయిప్రసన్న, బత్తుల ఈశ్వరగణేష్‌కుమార్‌లు శుక్రవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో నామినేషన్లు వేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 28వ వార్డు నుంచి ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఈశ్వర గణేష్‌కుమార్, 39వ వార్డు నుంచి ఎమ్మెల్యే భార్య మాధవి, 40వ వార్డు నుంచి ఆయన పెద్ద కుమారుడు సాయిప్రసన్న నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది.


