మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దొంతిరెడ్డి పద్మ, దొంతిరెడ్డి నవీన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా కార్యక్రమంలో నాయకులు యరగాని నాగన్న, తన్నీరు మల్లిఖార్జున్, దొంగరి వెంకటేశర్లు, గెల్లి రవి, మధిర ప్రతాపరెడ్డి, దాసా నాగేశ్వరరావు, గూడెపు శ్రీనివాస్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, పి. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


