ఆనాటి ఇంజనీర్ల కృషితోనే ఏఎమ్మార్పీకి జలకళ
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ గుర్రంపోడు డివిజన్ ఆవిర్భావం (1984) నుంచి పనిచేసిన ఇంజనీర్లు, కార్యాలయాల ఉద్యోగులు శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఏఎమ్మార్పీ క్యాంపు కాలనీలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడి నాసిరకంగా పనులు చేపట్టేలా తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పటిష్టంగా పనులు చేయించామని తెలిపారు. ఇప్పటి వరకు డివిజన్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, కార్యాలయ సిబ్బంది తమ అనుభవాలను పంచుకున్నారు. స్థానికులు వారిని పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ సీఈ ఖగేందర్, రిటైర్డ్ సూపరింటెండెంట్ కోడిరెక్క మట్టయ్య, ఎస్‌ఈ సూర్యనారాయణ రెడ్డి, ఈఈ విజయానంద్, రిటైర్డ్ ఎస్‌ఈ నర్సింగ్‌రాజ్, ప్రస్తుత డివిజన్ ఈఈలు నెహ్రూనాయక్, బద్రూనాయక్, డీఈ పరమేష్ పాల్గొన్నారు.
రిటైర్డు ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి


