జీరా రైస్‌లో గుట్కా ప్కాకెట్
● ఎంజీయూ వద్ద రోడ్డెక్కిన విద్యార్థులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మెస్‌లో జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం సృష్టించింది. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం, వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యార్థి నాయకులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మోహన్, ఛత్రపతి, మౌనేష్, సుధీర్, అజయ్, సతీష్, శంకర్, సూర్య, విజయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


