సాగర్‌కు వివిధ రాష్ట్రాల అధికారులు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌కు వివిధ రాష్ట్రాల అధికారులు

Feb 7 2026 2:47 PM | Updated on Feb 7 2026 2:47 PM

సాగర్‌కు వివిధ రాష్ట్రాల అధికారులు

సాగర్‌కు వివిధ రాష్ట్రాల అధికారులు

నాగార్జునసాగర్‌ : భారత్‌ దర్శన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు ప్రపంచ పర్యటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను శుక్రవారం సందర్శించారు. వీరు వారం రోజులుగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. సాగర్‌కు చేరుకున్న ఈ బృందానికి జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు నాగార్జునసాగర్‌ డ్యాం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాన్ని, బుద్ధవనాన్ని సందర్శించారు. ఇక్కడి విశేషాలను తెలుసుకున్నారు. బుద్ధవనంలోని బుద్ధ విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని ఆసక్తిగా వీక్షించారు. పెద్దవూర తహసీల్దార్‌ దేవిక్ష, సాగర్‌ ప్రొటోకాల్‌ అధికారి దండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ, జోసెప్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement