మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు
నల్లగొండ టూటౌన్ : కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులదే గెలుపని ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్‌లో 18 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశామని, మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ పట్టణానికి రూ.1300 కోట్లు తెచ్చి మెడికల్ కాలేజీ, రోడ్ల అభివృద్ధి, ఐటీ హబ్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, జంక్షన్ల విస్తరణ, పట్టణాన్ని సుందరీకరణ చేశామన్నారు. రూ.36 కోట్లు తెచ్చి ఎన్జీ కాలేజి భవనం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయకుండా మంత్రి గాలికి వదిలేశారన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే స్కూల్ కట్టి వాళ్ల పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, చీర పంకజ్‌యాదవ్, అబిమన్యు శ్రీనివాస్, పిచ్చయ్య పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ కోటిరెడ్డి


