నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుసరిస్తున్న విధానం, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణను తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్‌బీ సీఐ రాము, టూటౌన్ ఎస్‌ఐ సైదులు పాల్గొన్నారు.


