మున్సిపల్ వేడి.. పన్నుల రాబడి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు ఉండొద్దని ప్రభుత్వం షరతు విధించింది. అయితే బుధవారం మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు మున్సిపాలిటీకి బకాయి పడిని ఆస్తి, నీటి పన్నుల చెల్లింపునకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు బలపరిచే వారికి సంబంధించిన బకాయిలు చెల్లిస్తుండడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఒక్కరోజే రూ.13,70,493 పన్నులు వసూలయ్యాయి. ఆస్తి పన్ను కింద రూ.7,40,493, నీటి పన్ను 6,30,000 ఆదాయం సమకూరింది. పన్నుల చెల్లింపులతో మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడింది.
పన్ను బకాయిలు చెల్లిస్తున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు
ఒక్కరోజే సమకూరిన
రూ.13.70 లక్షల ఆదాయం


