నవాబుల నాటి మాల్‌ బౌలీ.. | - | Sakshi
Sakshi News home page

నవాబుల నాటి మాల్‌ బౌలీ..

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

నవాబుల నాటి మాల్‌ బౌలీ..

నవాబుల నాటి మాల్‌ బౌలీ..

రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలో చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అప్పటి పేర్లే నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటిదే పాతబస్తీలో ఉన్న మాల్‌బౌలి. నిజాం కాలం నుంచి ఈ పేరు వాడుకలో ఉంది. బౌలి అంటే బావి అని అర్థం. నిజాం కాలంలో ఇక్కడ ఉన్న శివాలయం వద్ద ఒక బావి ఉండేది. అప్పట్లో ఈ బావి నుంచి నీటిని తోడే సమయంలో అందులోంచి నగలు లభించాయి. అందువల్ల ఆ బావికి మాల్‌ బౌలిని పిలవడం మొదలు పెట్టారు. ఆ బావి ఉన్న ప్రాంతానికి క్రమంగా ఆపేరే పడిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మాల్‌బౌలి అని పిలుస్తుంటారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement