ముగ్గురు జూదరుల అరెస్ట్
తుర్కపల్లి : మండలంలోని వాసాలమర్రి గ్రామ శివారులో జూదం అడుతున్న ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తకియొద్దిన్ తెలిపారు. గ్మ్రా శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి మేడ్చల్‌కు చెందిన పెంజెర్ల రాజేందర్, దేవరి వేణురాజ్, కామారెడ్డికి చెందిన కోరంపల్లి సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పారిపోయారు. వారి వద్ద నుంచి రూ. 2.07 లక్షల నగదు, మూడు కార్లు, రెండు సెట్‌ల పేక ముక్కలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మణ్ సహాయంతో వాసాలమర్రి శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది పేకాట నిర్వహిస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫ రూ. 2లక్షలు స్వాధీనం


