ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

ఓటరు

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు

చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓ పార్టీ నాయకులు శ్రీపీపుల్స్‌ పల్స్‌శ్రీ సంస్థ సహకారంతో ఓటర్లు మోబైల్స్‌కు కాల్‌ చేస్తున్నారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఎందుకు అనే విషయమై మోబైల్‌ కాలర్‌ ద్వారా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ఓటర్ల నాడికి అనుగుణంగా తమ పార్టీల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఓటరు స్లిప్పుల పంపిణీ

భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. బీఎల్‌ఓలు రెండు రోజులుగా ఇంటింటికీ వెళ్లి స్లిప్పులను అందిస్తున్నారు. మున్సిపాలిటీలోని 13 వార్డులకు మొత్తం 15,827 మంది ఓటర్లు ఉన్నారని మున్సిపల్‌ కమీషనర్‌ అంజన్‌రెడ్డి తెలిపారు. మొత్తం 26 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. బూత్‌ల వారీగా 26 మంది బీఎల్‌ఓలు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని తెలిపారు.

బ్యాలెట్‌ పేపర్లు వచ్చాయ్‌...

భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయింది. శుక్రవారం ప్రత్యేక వాహనంలో భువనగిరి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాయి. మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ పర్యవేక్షణంలో పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక గదిలో భద్రపరిచి సీల్‌ వేశారు. ఈ నెల 10న డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు పంపిస్తారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు 128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,831 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 57,396 బ్యాలెట్‌ పేపర్లు వచ్చాయి. ఓటర్ల సంఖ్య కంటే 20 శాతం అదనంగా ఉన్నాయి.

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు1
1/2

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు2
2/2

ఓటరు ‘పల్స్‌’ పట్టేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement