మహిళలకు రేవంత్‌ సర్కార్‌ పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళలకు రేవంత్‌ సర్కార్‌ పెద్దపీట

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

మహిళల

మహిళలకు రేవంత్‌ సర్కార్‌ పెద్దపీట

యాదగిరిగుట్ట : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 7, 8 వార్డులలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ ఇస్తున్నారని వెల్లడించారు. ఎవరైనా మహిళ రుణం తీసుకొని మరణిస్తే ఆమెకు సంబంధించిన రుణం రూ.2లక్షలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మహిళా సంఘాలలో సభ్యత్వాలను అందజేస్తున్నామని తెలిపారు.

అబద్ధాలకు నిలువుటద్దం బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ నిజాలను దాచిపెట్టి, ప్రజలకు అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలే కానీ.. అబద్దాలపై అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్‌ కలలు కంటోందన్నారు. కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై అసూయతో నిందలు వేస్తున్నాడని మంత్రి సీతక్క విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆమె ఓటర్లను కోరారు. ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీలను అద్బుతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 మున్సిపాలిటీల్లో 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు బిక్షపతిగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి గుండ్లపల్లి వాణి, కౌన్సిలర్‌ అభ్యర్థులు ముక్కెర్ల వెంకటేష్‌, పెలిమెల్లి లావణ్య, ముక్కెర్ల మల్లేష్‌, మున్సిపల్‌ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఫ అబద్ధాలతో అధికారంలోకి

రావాలని బీఆర్‌ఎస్‌ కలలు కంటోంది..

ఫ యాదగిరిగుట్టలో ఎన్నికల

ప్రచారంలో మంత్రి సీతక్క

మహిళలకు రేవంత్‌ సర్కార్‌ పెద్దపీట1
1/1

మహిళలకు రేవంత్‌ సర్కార్‌ పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement