కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తగదు
మిర్యాలగూడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించడం హేయమైన చర్య అని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించడం ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆరోపించారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసుల్లో ఇరికించడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని, ప్రజలు అసహించుకునే స్థితికి చేరిందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ అభివృద్ధి చెందిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. ఈ సమావేశంలో జొన్నలగడ్డ రంగారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, పాలుట్ల బాబయ్య, కట్టా మల్లేష్‌గౌడ్, బాలాజీ నాయక్, మగ్దూం పాషా, మజీద్, ఇలియాస్, నల్లమోతు సిద్ధార్థ్, కోల రామస్వామి, సోము సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్


