చెర్వుగట్టులో దోపోత్సవం
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఘనంగా దోపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహా బలిహారణ, మహా పూర్ణాహుతి, హోమం, ధ్వజారోహణం, ఏకాదశ రుద్రభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంత సేవ వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి మోహన్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరెడ్డి, యాదగిరి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, మహేందర్‌రెడ్డి, నరేష్, గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు ఉప్పల సతీష్ శర్మ, మామిళ్ళపల్లి రాంబాబు శర్మ, మామిళ్లపల్లి సురేష్‌శర్మ, రెగిచేడు శ్రీకాంత్ శర్మ, మామిళ్లపల్లి నాగయ్య శర్మ, పోతులపాటి జగదీష్‌శర్మ, బుగ్వేద పడింతుడు రవితేజ, యజుర్వేద పండితుడు రాము పాల్గొన్నారు.


