విధి నిర్వహణలో అలసత్వం వద్దు
కొండమల్లేపల్లి : వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలందించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాహుల్, వేణుగోపాల్, డాక్టర్ కళ్యాణ్, మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, సూపర్‌వైజర్స్ సుగుణబాయి, రాణి, హరీష్ ఉన్నారు.
కాంగ్రెస్ తరఫున ఎ–ఫారం సమర్పించిన పున్న కై లాష్
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఎ–ఫారం (పార్టీ తరుఫున అభ్యర్థులకు బీ–ఫారం జారీ చేసే అధికారం ఉందని తెల్పడం) సమర్పించారు. ఈ మేరకు గురువారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ అశోక్‌రెడ్డికి ఎ–ఫారం అందజేశారు.
వాహనాలు జాగ్రత్తగా నడపాలి
మిర్యాలగూడ : వాహనాలను నడిపేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ) వాణి, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి (డీటీఓ) లావణ్య, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో డ్రైవర్లు, క్లీనర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి వారు హాజరై మాట్లాడారు. వాహనదారులు ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వాహనంలో ప్రయాణించే అనేక మందికి జరగరాని ప్రమాదం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. వేగం కంటే గమ్యస్థానం ముఖ్యమని భావించి సురక్షితంగా ప్రయాణం సాగేలా వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ మల్లిఖార్జున్, ఏఎంవీఐ సతీష్, అలీతోపాటు వైద్య సిబ్బంది, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
విధి నిర్వహణలో అలసత్వం వద్దు


