మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు.గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రమేష్, వ్యయ పరిశీలకుడు వెంకట్ ఆదిత్యతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు వివిధ నోడల్ టీంలను నియమించి వాటికి శిక్షణ ఇచ్చామన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన ఎన్నికల సంఘం సాధారణ, వ్యయ పరిశీలకులు జి.రమేష్, ఎస్.వెంకట్ ఆదిత్యకు కలెక్టర్ తన చాంబర్‌లో పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు నల్లగొండ మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ పాల్గొన్నారు.


