బీఆర్‌ఎస్‌లోకి యువత
చిట్యాల, నార్కట్‌పల్లి : చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డుకు చెందిన నిమ్మనగోటి శ్రీను ఆధ్వర్యంలో యువశక్తి యువజన సంఘానికి చెందిన వంద మంది యువకులు శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నార్కట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి చాడ కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, నాయకులు కొలను వెంకటేశ్‌గౌడ్, బొబ్బల శివశంకర్‌రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.


