మదర్‌ డెయిరీలో కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

మదర్‌ డెయిరీలో కుంభకోణం

Feb 10 2026 8:04 AM | Updated on Feb 10 2026 8:04 AM

మదర్‌ డెయిరీలో కుంభకోణం

మదర్‌ డెయిరీలో కుంభకోణం

పాలుపోయకుండానే రూ. 9.50 లక్షలు బిల్లు కై ్లమ్‌

జీఎం, మేనేజర్‌, సూపర్‌వైజర్‌ సస్పెన్షన్‌

సాక్షి, యాదాద్రి : పాలు పోయకుండానే రూ.9.50 లక్షల మేర బిల్లులు డ్రా చేసిన వ్యవహారంలో మదర్‌ డెయిరీ జనరల్‌ మేనేజర్‌ కృష్ణ, భువనగిరి మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ మేనేజర్‌ దశరథ, ప్రాసెసర్‌ పరమేశ్వర్‌రెడ్డిలు సస్పెండ్‌ అయ్యారు. మూతపడిన పాల కేంద్రాలలో పాలు పోసినట్లుగా దొంగబిల్లులు సృష్టించారు. పాలు పోయకుండానే భువనగిరి చిల్లింగ్‌ సెంటర్‌ నుంచి చెల్లింపుల కోసం ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మూడు నెలల్లో రూ.9.50 లక్షల మేర బిల్లులు మదర్‌ డెయిరీకి పంపించారు. మూతపడిన పాల కేంద్రాలు చాడ, ముత్తిరెడ్డిగూడెం, నమాత్‌పల్లి, సూరేపల్లి, ఏంబాయి సొసైటీల పేరుతో దొంగ బిల్లులు సృష్టించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ బిల్లులు డ్రా చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించనందున సెప్టెంబర్‌ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ స్కాంలో అప్పటి మదర్‌ డెయిరీ ఎండీ అయిన ప్రస్తుత జనరల్‌ మేనేజర్‌ కృష్ణ, భువనగిరి మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ మేనేజర్‌ దశరథ, ప్రాసెసింగ్‌ సూపర్‌ వైజర్‌ పరమేశ్వర్‌రెడ్డిల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన ఉద్యోగులపై విచారణకు ఆదేశించినట్లు మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఈ స్కాంపై పూర్తి విచారణ జరిపి దోషులను గుర్తించి రైతులకు న్యాయం చేస్తామని చైర్మన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement