కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌ను శనివారం డీఎస్‌పీ రాజశేఖర్‌రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
‘లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు’
కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే ఆ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని 14వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు స్థానిక నాయకులు నామినేషన్ వేశారు. మాజీ వైస్‌చైర్మన్ కందుల కోటేశ్వర్‌రావు గతంలో పోటీ చేసిన 6వ వార్డు ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. దాంతో ఆయన 14వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ వార్డుకు చెందిన వారిలో ఎవ్వరికిచ్చినా పర్వాలేదు గానీ వేరే వార్డు వారికి టికెట్ ఇవ్వవద్దంటూ నిరసన తెలిపారు. రామినేని శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమైన నాయకులు లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశంలో నాయకులు ఈదులు కృష్ణయ్య, వెంకట్‌రెడ్డి, పట్టాభిరెడ్డి, జైపాల్‌రెడి పాల్గొన్నారు.
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత


