పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫాం–12 సమర్పించాలని సూచించారు. పోల్ చీటీల పంపిణీ 54 శాతం పూర్తయిందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.
చెర్వుగట్టు హుండీ లెక్కింపు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాననికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 16 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. రూ.26,14,237 ఆదాయం వచ్చి నట్లు ఆలయ ఆధికారి మోహన్‌బాబు తెలి పారు. అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ. 16,45,100 వచ్చినట్లు వెల్లగించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ నేతగాని కృష్ణ, వరాల రమేష్, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివా స్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, నరేష్, మహేందర్‌రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి
ఓటుకు నోటు దొంగ
ఫ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నల్లగొండ టూటౌన్: సీఎం రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు దొంగ అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ, అమిత్‌షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్బాలు మాట్లాడటం మానుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతంపైగా కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్, పోతెపాక లింగస్వామి, చింత ముత్యాల్‌రావు, మిర్యాల వెంకటేశం, శ్రీనివాస్, పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారికి సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, రాత్రి పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి


