సంక్షేమానికే మీ ఓటు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికే మీ ఓటు

Feb 5 2026 7:17 AM | Updated on Feb 5 2026 7:17 AM

సంక్ష

సంక్షేమానికే మీ ఓటు

మిర్యాలగూడకు అధిక నిధులు ఇవ్వాలి కాంగ్రెస్‌ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి అభివృద్ధిని చూసి ఓటు వేయండి : ఎమ్మెల్సీ మిర్యాలగూడను జిల్లాగా చేయాలి : ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరు

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్‌ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్‌ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ హయాంలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు

అందిస్తున్నామన్నారు.

– జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. కార్పొరేట్‌ స్థాయిలో అన్ని వర్గాల పిల్లలకు విద్యను అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు.

,మిర్యాలగూడ : కాంగ్రెస్‌ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్‌ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్‌కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్‌ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్‌ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు.

రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం

వైఎస్సార్‌ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్‌ఎల్‌బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశాం

రెండేండ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.17,472 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నల్లగొండలోని మున్సిపాలిటీలకు రూ.2,228కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో రూ.295 కోట్లను మంజూరు చేశామన్నారు. భవిష్యత్‌లో మిర్యాలగూడ మున్సిపాలిటీకి, నల్లగొండ కార్పొరేషన్‌కు ఏం కావాలన్నా చేస్తానన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు అయ్యాక నాగార్జునసాగర్‌లో ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణం వద్ద యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్‌ శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, పద్మావతి, వంశీచందర్‌, మాజీ ఎంపీ హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ కోరారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందించి సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమ నిర్బందాలు ఉండేవని, నేడు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పెద్దలు జానారెడ్డి స్ఫూర్తితో రేవంత్‌రెడ్డి సారథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసికట్టుగా ఉండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్నారు.

మిర్యాలగూడ అర్బన్‌: మిర్యాలగూడకు జిల్లా అయ్యే అర్హతలు ఉన్నాయని జిల్లాగా ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల్లో విశ్వాసం నింపేందుకే కుటుంబ సభ్యులతో నామినేషన్‌ వేయించానని, కాంగ్రెస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. తాను ముఖ్యమంత్రికి ఇచ్చిన రూ.2 కోట్ల చెక్కుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ డబ్బులను రైతు సంక్షేమం కోసం వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని వార్డులను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం

ఫ ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎండబెట్టింది

ఫ నల్లగొండ, మిర్యాలగూడకు ఎన్ని నిధులైనా ఇస్తా

ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఫ మిర్యాలగూడలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ బహిరంగ సభ

జానారెడ్డి నమ్మి భాస్కర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వాపస్‌ తీసుకోవాలని భాస్కర్‌రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్‌రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్‌లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరు మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సంక్షేమానికే మీ ఓటు1
1/6

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు2
2/6

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు3
3/6

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు4
4/6

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు5
5/6

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు6
6/6

సంక్షేమానికే మీ ఓటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement