నార్కట్‌పల్లి : నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా గురువారం నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటు చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. యువత మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్, సర్పంచ్ జేరిపొత్తుల భరత్, కార్యదర్శి రవికుమార్, ఉప సర్పంచ్ శిరీష, సట్టు సత్తయ్య, పుల్లెంల శ్రీనివాస్, ఎస్‌బీ సీఐ రాము, నార్కట్‌పలి్‌ల్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


