చిట్యాల : రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీభిక్షం అధ్యక్షతన గురువారం జరిగిన గ్రామసభకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మ ందికిపైగా ఆసరా పింఛన్లు, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. తన పదవీకాలం మరో ఇరవై నెలలు ఉందని.. ఆలోపు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరింపజేయిస్తానన్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతారమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాలలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీడీఓ జయలక్ష్మి, తహసీల్దార్ విజయ, ఏఓ గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్ నేత, గ్రామ ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నాయకులు పల్లపు బుద్దుడు, పోలగోని స్వామి, చెరుకు సైదులు, పోలగోని నర్సింహ, ఉయ్యాల లింగయ్య, జన్నపాల శ్రీను, పాకాల దినేష్, గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు.
ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


