5,59,327 ఎకరాల్లో పంటలు
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ ముగిసింది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమైన యాసంగి సాగు జనవరి నెలాఖరుతో ముగిసిపోయింది. ఇప్పటి వరకు 5,52,327 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల చేస్తుండడంతో వాటి పరిధిలో వరి పెద్ద ఎత్తున సాగైంది.
అంచనాకు తగ్గిన వరిసాగు
యాసంగిలో 6లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. అందులో వరి 5.50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేసింది. అయితే సీజన్‌ముగిసే నాటికి వరి 4,36,876 ఎకరాల్లో సాగైంది. డిండి అయకట్టు పరిధిలో ఈ సారి సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేయలేదు. కేవలం బోరుబావుల కిందనే వరినాట్లు వేసుకున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలకు వరిసాగు కొంత సాగు తగ్గింది. వరి తరువాత రెండవ స్థానంలో వేరుశనగను రైతులు సాగు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 18,823 ఎకరాల్లో రైతులు వేరుశనగ వేశారు. ఎక్కువగా దేవరకొండ, చందంపేట, పీఏపల్లి తదితర మండలాల్లో వేరుశనగ సాగైంది.
రైతు భరోసా కోసం ఎదురుచూపులు
యాసంగి సీజన్ సాగు ముగిసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుభరోసా విడుదల చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది రైతులు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం రైతులు ఖాతాల్లో జమచేస్తారని రైతులు భావించారు. ప్రభుత్వం యాసంగి రైతుభరోసాను ఇస్తుందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జనవరి 26న రైతుభరోసా డబ్బులను విడుదల చేసిన ప్రభుత్వం మొన్నటి వరకు ప్రస్తుతం ఎలాంటి ప్రకటనా చేయలేదు. బుధవారం మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా వేస్తామని ప్రకటించడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు.
ఫ ముగిసిన యాసంగి సీజన్
ఫ అత్యధికంగా 4,36,876 ఎకరాల్లో సాగైన వరి


