ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్న కాంగ్రెస్
చిట్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి ప్రజాధనాన్ని లూఠీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. చిట్యాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, రైతు భరోసా, ఆసరా ఫించన్‌ల పెంపు వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్, మాస శ్రీనివాస్, కూరెళ్ల శ్రీను, పల్లె వెంకన్న, కంబాలపల్లి సతీష్‌కుమార్, గంజి గోవర్ధన్, జయారపు రామకృష్ణ, అంశల అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సయ్యగౌడ్


