ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

ఎన్ని

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నల్లగొండ టూటౌన్‌ : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల దష్ట్యా, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జోనల్‌, ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌, ఇతర పోలింగ్‌ అధికారులకు గురువారం నల్లగొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్‌ సోమయ్య పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో

మెరుగైన వైద్యసేవలు

దేవరకొండ : ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. మెటర్నటీ, ఇన్‌, అవుట్‌ పేషెంట్ల వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యులకు ఆయన పలు సూచనలిచ్చారు. ఆస్పత్రిలో గల వైద్యులు, సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడారు. ఆయన వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టాలి

మునుగోడు : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శంకర్‌నాయక్‌ అన్నారు. గురువారం ఆయన మునగోడులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామగ్రితోపాటు పండ్లు, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. వంటలు రుచికరంగా పెడుతున్నారా అన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ యుగేంధర్‌రెడ్డి, పాఠశాల ప్రత్యేక అధికారి వసంత ఉన్నారు.

నర్సరీల్లో పనుల వేగవంతానికి కృషి

తిప్పర్తి : వచ్చే సీజన్‌కు అవసరమయ్యే మొక్కల పెంచడానికి నర్సరీల్లో పనుల వేగవంతానికి కృషిచేయాలని జిల్లా పరిషత్‌ సీఈఓ బి.శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం ఆయన తిప్పర్తి మండలం రామలింగాలగూడేన్ని ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి నిషతో కలిసి సందర్శించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, గత 15వ ఆర్థిక సంఘం ద్వారా చేపట్టిన పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నర్సరీలతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకురి రమేష్‌, సర్పంచ్‌ ముత్తినేని శ్యాంసుందర్‌, ఫారెస్ట్‌ అధికారి మౌనిక, ఎంపీడీఓ జానయ్య, ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి1
1/3

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి2
2/3

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి3
3/3

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement