కేసీఆర్‌ను తిడితే గొప్పోడివి కావు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను తిడితే గొప్పోడివి కావు

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

కేసీఆర్‌ను తిడితే గొప్పోడివి కావు

కేసీఆర్‌ను తిడితే గొప్పోడివి కావు

మిర్యాలగూడ : 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ఎప్పటికీ గొప్పోడివి కావని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ మండలం గూడూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, ఆ కేసులో 56 రోజులు జైలులో ఉన్నారని, ఇప్పటికీ ఆయనపై 86 కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి ఎవరి బూట్లు తుడిచాడో, ఎవరి కాళ్లు పట్టుకున్నాడో అందరికీ తెలుసని విమర్శించారు. కాంట్రాక్టర్లు, అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణకు ఎప్పటికీ జాతిపిత అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పట్టణంలో కౌన్సిలర్ల నామినేషన్లను బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. రెండేళ్ల పాలనలో మిర్యాలగూడ పట్టణానికి ఇప్పటివరకు ఎలాంటి నిధులు తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్ధార్థ, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్‌, కట్టా మల్లేష్‌గౌడ్‌, కుందూరు వీరకోటిరెడ్డి, హాతీరాంనాయక్‌ పాల్గొన్నారు.

ఫ తెలంగాణ జాతిపిత కేసీఆరే..

ఫ మాజీ ఎంపీ లింగయ్య యాదవ్‌,

మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement