కనగల్ పీహెచ్‌సీని ఆదర్శంగా తీసుకోవాలి
కనగల్ : ప్రతినెలా 4 నుంచి 6 వరకు ప్రసవాలు జరుగుతున్న కనగల్ పీహెచ్‌సీని ఇతర పీహెచ్‌సీలు ఆదర్శంగా తీసుకొని వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. గురువారం ఆయన కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్, వార్డులు లేబర్ రూమ్ ఫార్మసీ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీ లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో కనగల్ పీహెచ్‌సీ జిల్లాలో ముందుండటం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, రాహుల్, దీప, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్స్ కళ్యాణ్ చక్రవర్తి, పద్మ, కృష్ణకుమారి, నగేష్, డీపీఓ విష్ణు, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ గాదరి రామకృష్ణ, డాక్టర్ రమణారెడ్డి, వెంకటేశం, శేషాదేవి, పద్మ పాల్గొన్నారు.
ఫ వైద్య ఆరోగ్యశాఖ డీహెచ్ రవీంద్రనాయక్


