వైద్యులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు సమన్వయంతో పనిచేయాలి

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

వైద్యులు సమన్వయంతో పనిచేయాలి

వైద్యులు సమన్వయంతో పనిచేయాలి

నల్లగొండ : ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమ్మడి జిల్లా మూడు ప్రధాన విభాగాల అధిపతులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ఆసుపత్రులు, వైద్య కళాశాలల అధిపతులతో సమన్వయ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నల్లగొండ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయడం, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకోవాలన్నారు. సమావేశంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో వైద్యాధికారులు పుట్ల శ్రీనివాస్‌, వెంకటరమణ, మనోహర్‌, నల్లగొండ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మాతృ, నల్లగొండ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ జె.సత్యనారాయణ, సూపరింటెండెంట్‌ నరసింహారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement