అన్నం తినే చేతిని మరువద్దు
నల్లగొండ : ‘అన్నం తినే చేతిని మరువద్దు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. హస్తమే మీకు అండగా ఉంటుంది’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండకు ఎన్ని నిధులు అడిగినా ఇస్తామన్నారని.. నల్లగొండను స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులకు ఓట్లేస్తే ప్రయోజనం ఉండదదని.. వారికి ఎమ్మెల్యే, మంత్రులు లేరి.. వారు ఎవరి వద్దకు వెళ్లి సమస్య పరిష్కరిస్తారో మీరే అర్థం చేసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉందని.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్లగొండలో రూ.900 కోట్లతో రింగురోడ్డు, లతీప్‌సాబ్‌గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్డు పనులు సాగుతున్నాయన్నారు. అంతకు ముందు 4వ డివిజన్ కేశరాజుపల్లి, 5వ డివిజన్, 20వ డివిజన్, 42వ డివిజన్, 47వ డివిజన్‌లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్‌ఖాన్, కార్పొరేటర్ అభ్యర్థులు ఇబ్రహీం, సుభాష్, పబ్బుసాయి, యామ కవిత, బోగరి వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.
ఫ కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించాలి
ఫ ఎన్నికలప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి


