రోజూ బడికి రావాలి
మర్రిగూడ : విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కోరుతూ మర్రిగూడ మండలంలోని దామెరబీమనపల్లి పాథమిక పాఠశాల హెచ్‌ఎం లచ్చిరాం వారం రోజు లుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి వారిని పాఠశాలకు తీసుకెళ్తున్నారు. మంగళవారం ఓ విద్యార్థి పొలం పనులు చేస్తుండగా తెలుసుకుని వారి పొలానికి వెళ్లి విద్యార్థిని పాఠశాలకు తీసుకొచ్చారు. విద్యార్థులు పొలం బాట కాదు.. బడి బాట పట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఎస్.వెంకట్‌కుమార్ ఉన్నారు.


