నల్లగొండలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం | - | Sakshi
Sakshi News home page

నల్లగొండలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

Jan 31 2026 10:50 AM | Updated on Jan 31 2026 10:50 AM

నల్లగొండలో  కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

నల్లగొండలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సతీమణి కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి బుర్రి చైతన్యతో 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నల్లగొండలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 48 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులందరూ గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ అభ్యర్థి బుర్రి చైతన్య మాట్లాడుతూ.. తనను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement