నల్లబెల్లం, పటిక పట్టివేత
మోతె : మండల పరిధిలోని గోల్‌తండాలో శుక్రవారం గుగులోతు మంగిత్య కుమారుడు రవీందర్ ఇంటి వద్ద 60 కేజీల నల్ల బెల్లం, 250 కేజీల పటికతో పాటు 5 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గుగులోతు రవీందర్‌ను సూర్యాపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించినట్లు తెలిపారు. ఎన్‌ఫోర్సుమెంట్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఎస్సై పి.గోపాల్‌రావు, హెడ్ కానిస్టేబుల్ అప్సర్, సిబ్బంది బ్రహ్మం, రమేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి కరాటే
పోటీలకు ఎంపిక
మిర్యాలగూడ టౌన్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ స్థాయి కరాటే పోటీలకు మిర్యాలగూడ మండలంలోని నలంద విద్యాలయం విద్యార్థులు ఎంపికయ్యారు. ఎల్లో బెల్ట్ అండర్–12 విభాగంలో బండారి హరిచందన, చేపూరి వంశీ, అండర్–14 విభాగంలో చేపూరి వర్షిత, కేతావత్ ఉదయ్ శ్రీ, రమావత్ దీపిక, రమావత్ శ్రవంతి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జొన్నలగడ్డ వెంకట్‌రెడ్డి, కరస్పాండెంట్ జొన్నలగడ్డ రజని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
వీధి కుక్కల దాడిలో
10 మేక పిల్లలు మృతి
నడిగూడెం : మండలంలోని నారాయణపురం గ్రామంలో తీగల శ్రీను ఇంటి ఆవరణలో ఉన్న మేక పిల్లలపై శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 10 మేక పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెందాయి. రూ.40 వేలకు పైగా నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.


