పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
చండూరు : ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. చండూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్‌కు, ఆర్డీఓకు పలు సూచనలు చేశారు. బ్లూ ప్రింట్‌పై పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేసిన బ్యాగులను విప్పి పరిశీలించారు. మెటీరియల్ సరిపోతుందా లేదా చూసుకుని అదనంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే అంశంపై చర్చించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీదేవి, ఎంపీడీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మల్లేషం, మాస్టర్ ట్రైనర్ మాదగోని వెంకటేశం తదితరులు ఉన్నారు.


