అధికార పార్టీతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీతోనే అభివృద్ధి

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

అధికా

అధికార పార్టీతోనే అభివృద్ధి

మంత్రి సీతక్క

చిట్యాలలో ఎన్నికల ప్రచారం

చిట్యాల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆయా పంచాయతీలకు రూ.250 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళ సంఘాలకు రూ.1200 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మహిళలను ఆర్థికం బలోపేతం చేసేందుకుగాను బస్సులు, పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చిట్యాలలో రైస్‌ మిల్లు ఏర్పాటుకు మహిళలకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేస్తే మురిగిపోతాయని, అభివృద్ధి ఉండదని చెప్పారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పాటి నర్సిరెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆయనకు రాష్ట్ర మంత్రి సీతక్క కండువ కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పందిరి శ్రీనివాసులు, గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య, కాటం వెంకటేశం, పాటి మాధవరెడ్డి, గుండెబోయిన సైదులు, పిశాటి భీష్మారెడ్డి, ఆవుల యాదయ్య, అంతటి వెంకటేశం, వడ్డెపల్లి లక్ష్మయ్య, జనగాం రవీందర్‌గౌడ్‌, బొబ్బల రాంరెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, అంశల సత్యనారాయణ, కాటం సత్తయ్య పాల్గొన్నారు.

అధికార పార్టీతోనే అభివృద్ధి1
1/1

అధికార పార్టీతోనే అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement