కాంగ్రెస్ పాలనలో కానరాని అభివృద్ధి
చిట్యాల : అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడా అభివృద్ధి కానరావట్లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాల మున్సిపాలిటీలోని రెండో వార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వార్డుకు చెందిన అజీముద్దిన్ యాబై కుటుంబాలతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం చిరుమర్తి మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభోత్సవాలు చేపట్టారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్ల మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేష్, బొబ్బల శివశంకర్‌రెడ్డి, కందాటి రమేష్‌రెడ్డి, కంభంపాటి సతీష్, సతీష్‌గౌడ్, శేఖర్, ఆనంద్, నరేందర్, మహ్మద్ గౌస్ పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి


