కార్మికులపై వేధింపులు ఆపాలి
నల్లగొండ టౌన్ : గ్రామపంచాయతీ కార్మికులపై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచ్‌ల వేధింపులు ఆపాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కొత్తగా గెలిచిన సర్పంచులు తమకు నచ్చిని వారిని తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని ఆపే విధంగా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అనంతరం డీపీఓ శంకర్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పొన్న అంజయ్య, చింతపల్లి బయన్న, పోలె సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, సింగపంగా లింగమ్మ, కొండేటి నరసయ్య, సర్వయ్య, ఎండీ.జహీర్, సురేష్, ఎర్ర అరుణ, నాంపల్లి శంకర్, కొండల్, శ్రీరాములు, పాలడుగు చంద్రయ్య, యాదయ్య, సైదమ్మ పాల్గొన్నారు.


