మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం
హాలియా : మున్సిపల్ ఎన్నికల్లో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అన్ని వార్డులను కై వసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలోని లక్ష్మి నరసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్ హాలియా, నందికొండ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడితే లక్షలాది ఎకరాలను నీరందుతుందని, కరీంనగర్‌లో మాత్రం కేసీఆర్ ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వారి కుటుంబ సభ్యుల ప్రాంతాలకు మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో హాలియా, నందికొండ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 మంది లబ్ధిదారులకు ఆరు మోటర్ వెహికిల్స్, 10 బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్స్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్లు కర్నాటి లింగారెడ్డి, ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కాకునూరి నారాయణగౌడ్, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్, గౌనీ రాజారమేష్‌యాదవ్, పాండు నాయక్, మజహార్ మైనోద్దీన్, చెరుపల్లి ముత్యాలు, పొదిల కృష్ణ, కుందూరు రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
దేవరకొండలో అన్ని వార్డులు గెలవాలి
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించి.. గెలిచే వారికే టికెట్ ఇస్తామన్నారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కావొద్దని.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ దేవరకొండ ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. అంతకు ముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మంజూరైన స్కూటీలు, వీల్‌చైర్లను పంపిణీ చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాశ్‌నేత, ఆలంపల్లి నర్సింహ, వడ్త్య దేవేందర్, ఎండీ.యూనూస్, వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, మారుపాకల సురేష్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, రేణుకానారాయణ, నజీర్, పున్న వెంకటేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


