రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ చేసింది శూన్యం | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ చేసింది శూన్యం

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ చేసింది శూన్యం

రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ చేసింది శూన్యం

మిర్యాలగూడ టౌన్‌ : ఆరు గ్యారంటీ పథకాలను ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రెండున్నర ఏళ్లుగా చేసిన అభివృద్ధి శూన్యం అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 3వ వార్డు తాళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ బలపరిచిన సీపీఎం అభ్యర్థి వై.పద్మ, సీపీఎం బలపరిచిన 2వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుడిసె జానకమ్మను గెలిపించాలని కోరారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప.. ప్రస్తుతం ఏ పనీ జరగలేదన్నారు. సీపీఎం, బీఆర్‌ఎస్‌ మిత్రపక్షాలను గెలిపిస్తేనే వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నలమోతు సిద్దార్థ, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రమేష్‌, ఇస్మాయిల్‌, నర్సింగ్‌, ఖరీం, బంటు ఈదయ్య, రీయాజ్‌, నాగులు, నాగేందర్‌, ముభీన్‌, జాంగీర్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement